GO UP
Image Alt

శరవతి అడ్వెంచర్ క్యాంప్ లో నా అనుభవం

separator
  /  శరవతి అడ్వెంచర్ క్యాంప్ లో నా అనుభవం

శరవతి అడ్వెంచర్ క్యాంప్ అద్భుతమైన పర్వతాలు మరియు నిర్మలమైన అడవులలో ఉంది. ఈ లాడ్జ్ నుండి ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడటం అంత కష్టమేమి కాదు, ఎందుకంటే పర్యాటకులు అనేక జాతుల మొక్కలు మరియు జంతువులను, అడవి జీవులను వాటి సహజ ఆవాసాలలో చూడవచ్చు మరియు అడవి యొక్క పర్యావరణ వ్యవస్థను గమనించవచ్చు. జోగ్ ఫాల్స్ నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో, కర్ణాటకలోని పచ్చని అడవులను ఆస్వాదించడానికి శారవతి అడ్వెంచర్ క్యాంప్ అనువైన ప్రదేశం.

శారవతి అడ్వెంచర్ క్యాంప్ మరియు చుట్టుపక్కల ప్రాంతం వర్షాకాలంలో వికసిస్తూ అందంగా కనిపిస్తుంది, ఈ సమయంలో నైరుతి వర్షపు మేఘాలు పశ్చిమ కనుమలను తడిపివేస్తాయి. ఇక్కడి పర్వతశిఖరాలపై నుండి పొగ మంచుతో కూడిన దుప్పటి, ఫ్రెష్ గా స్నానం చేసినట్లు ఉండే ఎత్తైన చెట్లు మరియు స్పష్టమైన నీలి ఆకాశాన్ని చూస్తుంటే దాదాపు ఒక కలలా ఉంటుంది. ఈ ప్రాంతంలో వాతావరణం ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా ఉంటుంది, వర్షపు జల్లులు ఇక్కడి ప్రకృతి అందాన్ని పెంచుతుంటే, శరవతి అడ్వెంచర్ క్యాంప్ మరియు జోగ్ ఫాల్స్ ను అన్వేషించడం చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

శారవతి వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం క్యాంపుకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది అనేక రకాల జాతుల చెట్లు, పొదలు మరియు మొక్కలను కలిగి ఉంది. ఇది ప్రకృతి ప్రేమికులకు అసాధారణమైన సీనరీ. పాండ్ హెరాన్స్, గ్రే-హెడ్ బల్బుల్స్, హార్న్బిల్స్, ఇండియన్ పీఫౌల్స్ మరియు కింగ్ ఫిషర్స్ వంటి అనేక రకాల సీతాకోకచిలుకలు మరియు అసాధారణ పక్షులను కూడా మీరు చూడవచ్చు. అభయారణ్యం యొక్క దట్టమైన అడవులలో బ్లాక్-నాప్డ్ కుందేలు, లాంగర్లు మరియు ఉడుతలు వంటి జంతువులను కూడా చూడవచ్చు. సమీపంలోని జైన పద్మావతి ఆలయానికి పడవలో ప్రయాణించి వెళ్లడం కూడా పర్యాటకులను మంత్రముగ్దులను చేసే అనుభవం.

శరవతి అడ్వెంచర్ క్యాంప్ కొత్తగా ఏదైనా కనుగొనేందుకు తగిన ప్రదేశం. అడవిలోంచి వచ్చే శబ్దాలతో పాటు అంతులేని నిశ్శబ్దం మరియు మృదువుగా వీచే గాలి అడవి యొక్క సువాసనలతో కలిసి, విశ్రాంతి తీసుకోవడానికి సరైన వాతావరణాన్ని అందిస్తుంది. క్యాంప్ సౌకర్యవంతంగా, అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను కలిగి ఉంటుంది మరియు ఆహారం కూడా రుచికరంగా ఉంటుంది. ఇది పర్యాటకులకు అరణ్య అనుభవాన్ని మరియు అడవి తల్లితో ఒకటిగా కలిసిపోయే అనుభూతిని అందిస్తుంది.